Wednesday, January 22, 2025

బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిర్తీ అంజి(25) అనే యువకుడు మహిళతో గొడవ పడడంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అంజి చైర్‌లో కూర్చొని మొబైల్ ఫోన్‌లో చెక్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అంజి చనిపోయాడని వెల్లడించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ పోలీసుల వద్ద ఉంది.

Also Read: లాడ్జ్ లో భార్య చేతిని నరికిన జవాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News