Saturday, January 25, 2025

పెళ్లై నాలుగు రోజులు… జ్యూస్‌ తాగుతుందని వధువును పుట్టింటికి పంపించాడు?

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: పెళ్లై వారం రోజులకే భార్యను పుట్టింటికి పంపించడంతో అతడి ఇంటి వద్ద వధువు తరపు బంధువులు ఆందోళన చేపట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతితో (22) ఏప్రిల్ 24న వివాహం జరిగింది. ఏప్రిల్ 28న నవ వధువును అమ్మగారింటి వద్ద వదిలి ప్రవీణ్ తన ఇంటికి వచ్చాడు. అత్తింటి వారు అల్లుడిని ప్రశ్నించడంతో యువతి ఇంట్లో అన్నం తినడం లేదని జ్యూస్‌లే తాగుతుందని సమాధానం చెప్పడంతో వారు విస్తుపోయారు. ఈ విషయం వరుడి తల్లిదండ్రులతో మాట్లాడగా తనకు సంబంధం లేదని చెప్పారు. పెద్ద మనుషులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. మళ్లీ యువతితో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు వరుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్థుల సమాచారం మేరకు బెల్లంపల్లి పోలీసులు అక్కడి చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు రమ్మని కబురు పంపారు. ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్‌ఐ నరేష్ మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News