Monday, December 23, 2024

గద్దెరాగడిలో పీటల మీద పెళ్లి పెటాకులు

- Advertisement -
- Advertisement -

Mancherial Bride Cancelled Wedding

మంచిర్యాల: పీటల మీద పెళ్లి ఆగిపోయిన సంఘటన మంచిర్యాల జిల్లా గద్దెరాగడిలో బుధవారం చోటుచేసుకుంది. తాళికట్టే సమయానికి ఓ యువతి పెళ్లిని అడ్డుకుంది. పెళ్లి కొడుకు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని వాపోయింది. పెళ్లి జరగడానికి వీల్లేదంటూ యువతి మండపంలోనే కూర్చుంది. యువతి ఆరోపణలతో పెళ్లికూతురు వివాహన్ని రద్దు చేసుకుంది. దీంతో పెళ్లి పెటాకులైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News