- Advertisement -
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం కత్తిపోట్ల కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్‌ఎ కాలనీలో పెళ్లి విందులో వధువు, వరుడి తరపు బంధువులు ఘర్షణకు దిగారు. ఆరుగురికి కత్తి పోట్లకు గురకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -