- Advertisement -
మంచిర్యాల: స్నేహితులతో కలిసి కన్నతండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇందారం గ్రామంలో ఆవిడపు రాజయ్య(45) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యపై పలుమార్లు దాడి చేశాడు. రాజయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో భార్యను పలుమార్లు వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో కుమారుడు సాయి సిద్ధార్థ తన స్నేహితులు సందీప్, వినయ్‌తో కలిసి రాజయ్యపై కత్తులతో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. అనంతరం నిందితులు పారిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -