Sunday, January 19, 2025

మంచిర్యాల అమ్మాయి… బ్రిటన్ అబ్బాయి … ఒక్కటైన జంట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మంచిర్యాల: ప్రేమకు కులం, మతం, వర్ణమే కాదు దేశాలు, ఖండాలు కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. అబ్బాయి బెన్ బ్రిటన్‌కు చెందిన వాడు కాగా తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్‌లైటౌలర్. అమ్మాయి సిందూర తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్, సుజాతల కూతురు.

సప్త సముద్రాల ఆవల పుట్టిన ప్రేమ సంద్రాలు దాటి.. ఖండాలు దాటి మూడు ముళ్లతో ఒక్కటైంది. పెద్దలు నిర్ణయించిన సుముహూర్తాన హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఒక్కటైంది. సిందూర యూకేలో ఎంఎస్ చదువుతున్న సమయంలో సహా విద్యార్థి బెన్ లైటౌలతో పరిచయం ఏర్పడి ఇది ప్రేమగా మారింది. ప్రస్తుతం బెన్ లైటౌలర్ జర్మనిలో, సిందూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని తమ దేశంలో ఇలాంటి వివాహ విధానంలేదని, సిందూర తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని బెన్ తల్లిదండ్రులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News