Wednesday, April 2, 2025

మంచిర్యాలలో ఇద్దరు యువతులు గొంతు కోసుకొని… ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మందమర్రి: మంచిర్యాల జిల్లా మంద్రమర్రి మండలం అదిల్‌పేట అటవీ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక యువతి మృతి చెందగా మరో యువతి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మంచిర్యాలలో ఇద్దరు మహిళలు కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. మనస్థాపంతోనే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News