Wednesday, January 22, 2025

మేక పోయిందని…. పశువుల కాపరిని తలకిందలుగా వేలాడదీసి….

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మేకను ఎత్తుకెళ్లారని యజమాని తన పశువుల కాపరితో పాటు అతడి స్నేహితుడిని తల్లికిందులుగా వేలాడదీసి దాడి చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాములు- స్వరూప అనే దంపతులకు మేకలు ఉన్నాయి. ఈ దంపతుల వద్ద పశువుల కాపరిగా తేజ(19) అనే యువకుడు పని చేస్తున్నాడు. 20 రోజుల క్రితం వీరి మంద నుంచి మేక తప్పిపోవడంతో తేజ, అతడి స్నేహితుడు కిరణ్ కలిసి మేకను ఎత్తుకెళ్లారని యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరిని మేకల దొడ్డి వద్దకు రమ్మని కబురు పంపాడు. ఇద్దరు అక్కడికి చేరుకొని వాళ్లను తాళ్లతో కట్టేసి తలకిందలుగా వేలాడదీశారు. అనంతరం వారిపై దాడి చేయడంతో పాటు పొగపెట్టి ఊపిరాడకుండా చేశారు. ఈ వీడియో, ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News