Tuesday, January 21, 2025

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య…. భర్త వేధింపులు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధిః మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ జ్యోతి అనే దంపతులు ఆదిత్య ఎంక్లేవ్ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. బాలకృష్ణ ప్రతీ రోజులాగే ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళగా పిల్లలు స్కూల్‌కు వెళ్ళారు. కమిషనర్ మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పటికి ఎంతకు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా బెడ్ రూములో జ్యోతి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న డిసిపి, ఎసిపిలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా జ్యోతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News