Thursday, April 17, 2025

మనోజ్ ను చూసి కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మీ.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా మనోజ్, మంచు లక్ష్మీకి సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మంచు లక్ష్మీని మనోజ్ సర్ ప్రైజ్ చేశారు. తన సోదరి లక్ష్మీ స్టేజ్ పై ఉండగా.. మనోజ్ ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. సడెన్ గా మనోజ్ ను చూసిన లక్ష్మీ..ఆయనను పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. మనోజన్ పట్టుకుని కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణుల మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పంచాయితి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. సద్దుమనిగిందనుకున్న గొడవ మళ్లీ రాజుకుంది. ఇటీవల తన కూతురు బర్త్ డే వేడుక జరుపుకునేందుకు జైపూర్ వెళ్లగా.. తన ఇంట్లోకి విష్ణు మనుషుు వచ్చి.. కార్లు, విలువైన వస్తువులను దొంగలించారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News