Monday, March 31, 2025

హైదరాబాద్ ఓటర్లపై సినీ నటి మంచు లక్ష్మి ఆగ్రహం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఓటర్లపై సినీనటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తాను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చానని వివరించారు. కానీ హైదరాబాద్ లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి రాకపోవడం దారుణమని దుయ్యబట్టారు. భాగ్య నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలని మంచు లక్ష్మి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News