Monday, December 23, 2024

తండ్రైన మంచు మనోజ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ అభిమానులకు శుభవార్త చెప్పారు. తన సోదరుడు, హీరో మంచు మనోజ్ తండ్రయ్యారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మనోజ్, మౌనిక దంపతులు తల్లితండ్రులయ్యారని.. భూమా మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు. మా ఇంట దేవత కాలుపెట్టిందని.. పాపకి ఎంఎం పులి అని నిక్ నేమ్ కూడా పెట్టామని.. ఆ పరమశివుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను ఎక్స్ వేదికగా లక్ష్మీ తన ఆనందాన్ని అభిమానులుతో పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు మనోజ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. గతేడాది మనోజ్‌, భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మౌనికకు ఇదివరకే కొడుకు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News