మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తన అన్న మంచు విష్ణుపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో తెలిపారు. జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నాడు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశానని.. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల ఉన్నట్టుండి మంచు ఫ్యామిలీలో గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మంచు బ్రదర్స్.. ఇద్దరూ బౌన్సర్లతో ఒకరిపై ఒకరు గొడవకు దిగడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు సంబంధించిన కవరేజ్ కోసం వెళ్లిన ఓ రిపోర్టర్ పై మోహన్ బాబు చెయి చేసుకోవడంతో… ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మోహన్ బాబు సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.