హైదరాబాద్: తన తల్లి మీత ప్రమాణం చేసి చెబుతున్నా.. తాను ఏరోజూ ఆస్తి కోసం కొట్లాడలేదని నటుడు మంచు మనోజ్ అన్నారు. బుధవారం జల్‌పల్లిలోని తన తండ్రి మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మనోజ్ ను లోనికి అనుమతించలేదు. దీంతో ఆయన ఇంటి బయటే కూర్చోని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్లనివ్వడంలేదు. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి. అవి ఇవ్వమని అడుగుతున్నా. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న వచ్చాం. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లాం. విష్ణు భవిష్యత్ కోసం ఆడవేషం కూడా వేశా. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయట్లేదు అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.
మరోవైపు, ఎలాంటి గొడవలు జరగకుండా.. మోహన్‌బాబు నివాసం వద్ద పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తన కారు, విలువైన వస్తువులను దొంగలించారని మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని విష్ణుపై మనోజ్ ఆరోపణలు చేశారు.