Thursday, February 20, 2025

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ బైఠాయింపు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ బైఠాయించారు. సోమవారం రాత్రి 11.15 గంటలకు మనోజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. నటుడు అతడు తన సిబ్బందితో కలిసి కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్‌లో బస చేశారు. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఇక్కడి సెలబ్రిటీలు ఉండటం సురక్షితం కాదని ఆయనకు చెప్పారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉన్నావని పోలీసులు ప్రశ్నించారు. మనోజ్ తో పాటు సిబ్బందిని పిఎస్ కు తరలించారు. దీంతో పోలీసులతో మనోజ్ వాగ్వాదానికి దిగాడు. తాను టెర్రరిస్టునా? తాను దొంగనా అర్థరాత్రి తనని ఎందుకు బెదిరిస్తున్నారని పోలీసులను అడిగారు. రాజకీయ నాయకుల పేర్లు ఉపయోగించి తనని ఎందుకు బెదిరిస్తున్నారని నిలదీశాడు. పోలీస్ స్టేషన్‌లో మెట్లపై కూర్చొని నిరసన తెలిపాడు. ఎంబియు విద్యార్థుల కోసం పోరాడుతుంటే తనని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ ఇమ్రాన్‌బాషాతో పోన్‌లో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News