Monday, December 23, 2024

మంచు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్..

- Advertisement -
- Advertisement -

మంచు ఫ్యామిలీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మంచు మనోజ్. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన అత్తమ్మ భూమా శోభా నాగిరెడ్డి పుట్టినరోజును సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడించారు.

Manchu Manoj to become a Father

దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరోసారి గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారని తెలిపారు. మీ ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలని కోరుతున్నట్లు మనోజ్ ట్వీట్ చేశారు. గతేడాది మంచు మనోజ్, భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ కు, భూమా మౌనికకు ఇది రెండో వివాహం. ఇదివరకే, మౌనికకు కుమారుడు కుడా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News