Saturday, January 11, 2025

మంచు విష్ణు తరుఫున 40 మంది బౌన్సర్లు.. 30 మంది బౌన్సర్లను దింపిన మనోజ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతుంది. నగర శివారు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద విష్ణు తరపున 40 మంది బౌన్సర్లను మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విష్ణుకు పోటీగా మంచు మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లను తెప్పించారని… అయితే, మనోజ్ తరపు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదని ప్రచారం జరుగుతోంది.

కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని, అతను వచ్చిన తర్వాత గొడవ జరిగే అవకాశం ఉందంటూ వార్తా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మంచు ఫ్యామిలీ గొడువ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో మంచు విష్ణు టీమ్ స్పందించింది. విష్ణు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారని.. ఆయన సోమవారం హైదరాబాదు వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. మంచు విష్ణు స్వయనా వివరాలను అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది.

కాగా, నిన్న మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ జరిగిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలను మంచు ఫ్యామిలీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కాసేపటికే.. మనోజ్ స్వల్ప గాయాలతో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో వీరి మధ్య నిజంగానే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు తనపై దాడి జరిగినట్లు మనోజ్ 100 డయల్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులే చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News