Thursday, December 12, 2024

మోహన్ బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మంచు మోహన్ బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి.. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండటంతో.. తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఇంటిలో పని చేస్తున్న స్టాఫే కారణం అని ఆమె తెలిపింది. మోహన్ బాబు‌పై మంచు మనోజ్ చేయి చేసుకున్నాడని.. తండ్రీ కొడుకులు నెట్టుకున్నా.. ఎవరికీ దెబ్బలు తగలలేదని తెలిపింది. ముఖ్యంగా మంచు మనోజ్‌కు దెబ్బలు తగిలినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఆమె తెలిపింది.

మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు. మోహన్ బాబు మీద చేయిపడితే విష్ణు ఊరుకోడు. అసలు జరిగింది ఏమిటంటే.. శనివారం రాత్రి ప్రసాద్ అనే తన సిబ్బంది ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు. ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్‌ను మనోజ్ దండించబోయారు. అదే సమయంలో నా సిబ్బందిపై చెయ్యి వేయవద్దు, వారికి నేనే భయం చెప్పుకుంటాను.. అంటూ మనోజ్‌ని మోహన్ బాబు తోసేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. అసలు జరిగింది ఇదే. దీనికి వారి మధ్య ఉన్న పాత గొడవలను కూడా యాడ్ చేసుకుని.. విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మొదటి నుండి మోహన్ బాబుకి ఇష్టం లేదు.. అని పనిమనిషి తెలిపింది.

Manchu Vishnu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News