Friday, January 17, 2025

మనోజ్ ఫిర్యాదులో నిజంలేదు:తల్లి నిర్మలాదేవి

- Advertisement -
- Advertisement -

మంచు మనోజ్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజంలేదని అతడి తల్లి నిర్మలాదేవి పహాడీషరీఫ్ పోలీసులు లేఖ రాసింది. ఇప్పటి వరకు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కుమార్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా. మనోజ్‌కుమార్ తల్లి నిర్మలా దేవి మనోజ్ కుమార్‌పై పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు పహాడీషరీఫ్ ఫోలీసులకు లేఖ రాసింది. డిసెంబర్ 14వ తేదీన తన తల్లి పుట్టిన రోజున ఇంటికి వచ్చిన తన అన్న విష్ణు అనుచరులతో విచ్చి తన ఇంట్లోని జనరేటర్‌లో చక్కర పోశాడని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై నిర్మాలాదేవి పోలీసులకు లేఖ రాసింది. తప పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు అయిన విష్ణు జల్‌పల్ల్లిలోని తన ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని తెలిపారు.

దీనికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్‌ను మనోజ్ కుమార్ బయట పెట్టి విష్ణు గొడవ చేసినట్లు ఆరోపణలు చేశాడని పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన తన పెద్ద కుమారుడు తన రూములో ఉన్న కొన్ని సామాన్లు తీసుకుని వెళ్లాడని తెలిపారు. తన ఇంట్లో ఇద్దరు కుమారులకు సమానంగా హక్కు ఉందని తెలిపారు. విష్ణు దౌర్జన్యం చేయడం కానీ, మనుషులతో ఇంట్లోకి వచ్చి గొడవ చేయడం కానీ చేయలేదని, మనోజ్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజంలేదని తెలిపారు. ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ పనిచేయలేమని, పనిమానేశారని, ఇందులో విష్ణు ప్రమేయం లేదని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News