Sunday, February 16, 2025

ప్రభాస్‌ నుంచి మరో సహాయం కోరుతున్న మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత నుంచి ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మనకి కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, సినిమాలో నటీనటుల కోసం చిత్ర బృందం వేట ప్రారంభించింది.

వయస్సుతో సంబంధం లేకుండా సినిమా లేదా థియేటర్‌లో అనుభవం ఉన్న వారు ఈ సినిమాలో నటించేందుకు దరఖాస్తు చేసుకోవాలని చిత్ర బృందం ‘ఎక్స్’ వేదికగా పిలుపునిచ్చింది. దీనిపై అభిమానులు కోకొల్లలుగా స్పందించగా.. ప్రముఖ హీరో మంచు విష్ణు కూడా స్పందించాడు. తాను కూడా ఈ సినిమాలో నటించేందుకు దరఖాస్తు చేసుకున్నానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆయన ప్రభాస్‌ నుంచి మరోసారి సహాయాన్ని కోరినట్లు అయింది.

ఎందుకంటే మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ . ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. మరి సినిమాలో ఈ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి అని అంతా అనుకుంటున్నారు. మహాభారత సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌కుమార్‌ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మోహన్‌బాబు నిర్మిస్తున్నా. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News