Wednesday, January 22, 2025

చిరంజీవి-సిఎం జగన్‌ మీటింగ్ వ్యక్తిగతమే: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపి సిఎం జగన్‌ను కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ త్వరలోనే చిత్ర పరిశ్రమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అయితే చిరంజీవి, ఏపి సిఎం జగన్‌ల భేటీని వ్యక్తిగతం అంటూ మంచు విష్ణు తాజాగా వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ “ఇటీవల చిరంజీవి ఏపి సిఎం జగన్‌ని కలిశారు. అది వ్యక్తిగత సమావేశమే. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ఏపి ప్రభుత్వంతో ఛాంబర్ చర్చలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. అలా కుండా వ్యక్తిగతంగా కలవాలని కోరితే మేం కూడా ఆయా ప్రభుత్వాలను కలిసి చర్చిస్తాం. అయితే ఒక ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించింది.. ఇంకో ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని అందరు ఏకతాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకుందాం”అని అన్నారు.

Manchu Vishnu comments on Chiru-CM Jagan Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News