Wednesday, January 22, 2025

మంచు మనవరాళ్ల గ్రాండ్ ఎంట్రీ..

- Advertisement -
- Advertisement -

డా.మంచు మోహన్ బాబు మనవరాళ్లు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘ఇదే స్నేహం…’ అంటూ సాగే ఈ పాట వీడియోను ఆదివారం విడుదల చేసారు.

ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్, అచ్చు రాజామణి, సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పారు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జిన్నా’ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

Manchu Vishnu Daughters entry into Industry with Jinnah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News