Monday, December 23, 2024

నాన్నకు ఇన్విటేషన్ వచ్చినా అందజేయలేదు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu meet with AP CM Jagan

విజయవాడ: నాన్నకు ఇన్విటేషన్ వచ్చినా అందజేయలేదు.. ఇలా ఎవరు చేశారో మాకు తెలుసని మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ”సీఎం జగన్ ను కలవడం ఇది మూడో సారి. నాకు వరుసకు బావ అవుతారు. అయినా అన్న అని పిలుస్తాను. ఇవాళ కలిసింది పూర్తిగా పర్సొనల్ విజిట్. నేను తిరుపతిలో స్టూడియోలు కడతాను. రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి. తెలంగాణ, ఆంధ్రా రెండు కళ్లు. విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తాం. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. అయినా ఆయనకు అందజేయలేదు. ఎవరు ఇలా చేశారో మాకు తెలుసు. పేర్ని నానితో సమావేశంపై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసింది. నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు. టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు. పేర్ని నాని మా ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారు. మాకు సపోర్ట్ లేకపోతే మా ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తాను. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించాను.నాన్న గారు ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్. ఆయనకు ఇన్విటేషన్ అందకపోవడంపై ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం. ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తాం.ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కుటుంబం. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. అవన్నీ పరిష్కరించుకుంటాం” అని పేర్కొన్నాడు.

Manchu Vishnu meet with AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News