Wednesday, December 25, 2024

‘జిన్నా’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu Press Meet about Ginna

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు హీరోయిన్స్‌గా నటించారు. జి.నాగేశ్వర్ రెడ్డిది మూల కథ. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ “మా జిన్నా’ చిత్రాన్ని చాలా కష్టపడి నిర్మించాము. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5న విడుదలవుతుంది. మా అందరికి ఇది ఒక అద్భుతమైన జర్నీ, సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది”అని తెలిపారు. దర్శకుడు సూర్య మాట్లాడుతూ “నేను మోహన్ బాబు సంస్థలో ఈ సినిమా చేస్తానని అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబు, విష్ణులకు నా ధన్యవాదాలు. ఈ చిత్రం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది”అని అన్నారు. జి. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ “విష్ణు కెరీర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు అన్నీ బ్లాక్‌బస్టర్‌లే. ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఈ చిత్రం మహిళలకి సూపర్‌గా నచ్చుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కొత్త సన్నీ లియోన్‌ని చూస్తారు. విష్ణు పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా రిస్కీ షాట్స్ చేశారు, డ్యాన్స్ ఇరగదీశారు, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి” అని పేర్కొన్నారు.

Manchu Vishnu Press Meet about Ginna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News