Monday, December 23, 2024

6 నెలలలోపే ‘మా’ బిల్డింగ్‌కు భూమి పూజ చేస్తాం: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu press meet on MAA Building

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఆధ్వర్యంలో ఆర్టిస్ట్‌లకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పలువురు నటీనటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ… ‘మా సభ్యులకు ఎఐజి హాస్పిటల్ వారు ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. ఇక, మరో ఆరు నెలలలోపే ‘మా’ బిల్డింగ్‌కి భూమి పూజ చేస్తాము. ‘మా’ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి, పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ చర్చించుకోవాలి. ‘మా’ సభ్యత్వంకు సంబంధించి కఠినమైన నిబంధనలు పెట్టాము’అని చెప్పారు. సీనియర్ నటులు నరేష్ మాట్లాడుతూ… ‘మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడు అయిన తరువాత మొదటి ప్రాధాన్యత హెల్త్‌కి ఇవ్వడం సంతోషంగా ఉంది. సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. నటీనటులు ఆరోగ్యంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఎఐజి హాస్పిటల్ వారు ‘మా’కు ఇస్తున్న సహకారం మరువలేనిది. డా. నాగేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ కూడా జరుగుతోంది’ అని తెలిపారు. ఈ సమావేశంలో మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, డా. నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొనన్నారు.

Manchu Vishnu press meet at AIG Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News