Wednesday, January 22, 2025

ట్రోల్స్‌పై మంచువిష్ణు సీరియస్.. ఓ హీరో తన కుంటుంబాన్ని టార్గెట్ చేస్తూ..

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu serious on Trolls

ట్రోల్స్‌పై మంచువిష్ణు సీరియస్
ఓ హీరో టార్గెట్ చేశాడంటూ ఆగ్రహం
త్వరలోనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
హైదరాబాద్: సోషల్ మీడియా లో తనపై, తన కుటుంబపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. కొంతకాలంగా ఆయనపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై సీరియస్ అయ్యారు. ట్రోల్స్ ఇకపై సహించేది లేదని.. టాలీవుడ్‌లో ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే తన కుటుంబంపై ట్రోలింగ్ జరుగుతోందని మంచు విష్ణు మండిపడ్డారు. తనపైనా, తన కుటుంబంపైనా పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఓ హీరో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశాడని ఆరోపించారు. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు జూబ్లిహిల్స్‌లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించానని స్పష్టం చేశారు. ఆ హీరో నడుపుతున్న ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించానని పేర్కొన్నారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు.

Manchu Vishnu serious on Trolls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News