Thursday, January 23, 2025

ప్రభుదేవా కొరియోగ్రఫీలో పాట

- Advertisement -
- Advertisement -

డా.మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాలో విష్ణు మంచు నటిస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ రేణుకగా, పాయల్ రాజ్‌ఫుత్ స్వాతిగా కీలక పాత్రలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News