Wednesday, January 22, 2025

స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ టీజర్‌లో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, మహాశివునిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను కూడా చూపించారు. ఐతే, ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని తెలిసింది. ఈ సాంగ్‌లో మంచు విష్ణుతో పాటు మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ కూడా కనిపిస్తారని సమాచారం. ఇదొక స్టోరీ టెల్లింగ్ సాంగ్ అని, బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని సీన్స్ కూడా రన్ అవుతాయని టాక్. కాగా ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News