సినీనటులు అన్నదమ్ముళ్లు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఎక్స్‌లో మాటల యు ద్ధం జరిగింది. తన తండ్రి మంచు మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ మంచి విష్ణు పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ డైలాగ్ తనకు చాలా ఇష్టమంటూ కామెంట్ చేశాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుందని, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావ ని ఆశ అని మోహన్ బాబు ఆ సినిమాలో చెప్పిన డైలాగును విష్ణు పోస్ట్ చేశాడు. దీంతో మంచు విష్ణుకు కౌంటర్ ఇస్తూ మంచు మనోజ్ కూడా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజులాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రా డ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తె లుసుకుంటావు అని అన్నాడు.
అంతేకాదు మోహన్ బాబు చెప్పిన మరో డైలాగ్‌ను ట్వీట్ చేస్తూ చురకలు అంటిచారు. టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్‌పల్లిలోని నివాసం వ ద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది. పం డుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రం గంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అ నుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎ క్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని చెప్పడంతో ఇరువర్గాల దూషణకు దిగాయి. ఈ వ్యవహారం కూ డా కేసుల వరకూ వెళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్స్ వార్ మరోసారి వైరల్‌గా మారింది.