Friday, November 22, 2024

‘మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu won as MAA President

ప్రకాశ్‌రాజ్‌పై గెలుపు

మనతెలంగాణ / హైదరాబాద్ : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ప్రకాష్ రాజ్‌పై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు. మంచు విష్ణుకు 380 ఓట్లు రాగా ప్రకాష్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. ఇక ‘మా’ జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలుపొందారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన ఆయన జీవిత రాజశేఖర్‌పై విజయం సాధించడం విశేషం. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ విజయం సాధించారు. ఆయన బాబుమోహన్‌పై గెలుపొందారు.

వైస్ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్ నుంచి మాదాల రవి గెలిచారు. ‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్ నుంచి శివబాలాజీ గెలిచారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు గెలుపొందారు. ఇక ్రప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి 10 మంది కార్యవర్గ సభ్యులు విజయం సాధించగా అటు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో 8 మంది కార్యవర్గ సభ్యులు గెలుపొందారు. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ,కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి, అనసూయ, ఖయ్యూం, సంపూర్ణేష్, బ్రహ్మాజీ కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు.

రికార్డు స్థాయిలో ఓటింగ్…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. మొత్తం 605 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ 60తో కలిపి మొత్తం 665 ఓట్లు నమోదయ్యాయి. ‘మా’లో మొత్తం 905 మంది సభ్యులు ఉండగా వీరిలో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉంది. ఇక ఈసారి రికార్డు స్థాయిలో 72 శాతం ఓట్లు పోలవడం విశేషం. ఓటింగ్‌కు వచ్చిన సభ్యులను చూసి ఓటింగ్‌ను మరో గంట పాటు పొడిగించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ౩ గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి ‘మా’ సభ్యులు విమానాల్లో వచ్చి మరీ ఓట్లు వేయడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News