Monday, January 13, 2025

మాజీ ఎంపి మందా జగన్నాథం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగర్ కర్నూలు మాజీ ఎంపి మందా జగన్నాథం  కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మందా గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించారు. నాలుగు పర్యాయాలు ఎంపిగా సేవలందించారు. 1996, 1991, 2004, 2009లో ఎంపిగా గెలిచారు. మూడు సార్లు టిడిపి, ఒకటి సారి కాంగ్రెస్ తరఫున ఎంపిగా గెలిచారు.

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1996లో టిడిపి తరఫున ఆయన ఎంపిగా గెలిచారు. 1999లో రెండవసారి 2004లో మూడవసారి, తిరిగి 15వ లోక్ సభకు 2009లో గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. రెండో పర్యాయo 2019 వరకు అదే హోదాలో కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్ లో బిల్లు పెట్టిన సమయంలో ఆయన గట్టిగా సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పే విధంగా వ్యవహరించారు. నాగర్ కర్నూల్ ప్రాంతంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. మందా జగన్నాథం స్వగ్రామం గద్వాల నియోజకవర్గంలోని అలంపూర్. మందా జగన్నాథ్ మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సంతాపం తెలపడంతో సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News