Saturday, February 22, 2025

ప్రీతిది ఆత్మహత్యకాదు… హత్యే: మంద కృష్ణ మాదిగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా ఆత్మహత్య కేసుగా ఎలా నమోదు చేస్తారని పోలీసులను  ప్రశ్నించారు. ప్రీతి కేసును హత్య కేసుగా నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో నిరసనలు నిర్వహిస్తామని, ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలను అడ్డుకుంటామని మందకృష్ణ హెచ్చరించారు. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడంతోనే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News