Friday, January 17, 2025

రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్లో అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడు.. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరతాడని జోస్యం చేప్పారు. రేవంత్ ఒంటి మీద కండువా ఇప్పటికి మూడు సార్లు మారింది. అంతకు ముందు బీజేపీ అనుబంధ సంస్థలో ఉండేవాడన్నారు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుంది. ఇలాంటి వాడిని మేం ఎలా నమ్మాలి అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News