Friday, January 17, 2025

ప్రధాని మోడిని కలిసిన మందకృష్ణ మాదిగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిశారు. ఇటీవల ప్రధాని మోడి తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించిన సందర్భంలో ఈ కలయిక జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను ప్రధాని మోడి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి ఫొటోలను ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రధాని మోడిని కలిసిన సందర్భంగా షెడ్యూల్ కులాల(ఎస్‌సి)వర్గీకరణ గురించి ప్రధాని మోడి వద్ద మందకృష్ణ ప్రస్తావించినట్టుగా పేర్కొన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడి వరంగల్‌కు వచ్చిన సమయంలో ప్రత్యేక సమయం తీసుకొని ప్రధానిని కలిసినట్టుగా మందకృష్ణ చెప్పారు. ఈ సందర్బంగా మోడి తనను ఎంతో ప్రేమతో హత్తుకొని ఆత్మీయంగా పలకరించారని చెప్పారు. ఈ భేటీలో ప్రధాని మోడి వద్ద ఎస్‌సి వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చించినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News