Monday, December 23, 2024

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు..

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న నిఖిత అనే అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంద కృష్ణ మాదిగ అచ్చంపేట బందు పిలుపు మేరకు గురువారం అఖిల పక్ష నేతలు ఉదయాన్నే పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కలియ తిరుగుతూ వ్యాపార సముదాయాలను మూయించి నిరసనలు వ్యక్తం చేశారు. నిఖిత మరణానికి నిరసనగా అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద మందకృష్ణ మాదిగ చేపట్టిన ధర్నాకు అఖిల పక్ష నేతలు మద్ధతు తెలిపారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ విద్యార్థిని నిఖిత మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై హై కోర్టు మెజిస్ట్రేట్‌తో పూర్తి స్థాయిలో విచారణతో పాటు పిఎం రిపోర్టు, ఉస్మానియా, గాంధీ డాక్టర్లతో రీ పోస్టుమార్టం జరిపించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News