Monday, January 20, 2025

మంత్రి సింగిరెడ్డికి మండల నాయకుల సన్మానం

- Advertisement -
- Advertisement -

మదనపురం : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డినీ బుధవారం మదన పురం మండల నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ నారాయణ, రైతు బంధు జిల్లా సభ్యులు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు టిసి నాగన్న యా దవ్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలి సినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించినట్లు చెప్పారు.

వారు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి మూడవసారి టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేశి వెంకటేష్‌యాదవ్, కొల్లూరు సీనియర్ నాయకులు పెంటన్న, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చీర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News