Monday, December 23, 2024

మంచిర్యాలలో అగ్నిప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతులు భర్త శివయ్య(55), భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. డిసిపి అఖిల్ మహాజన్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఎవరైనా ఇంటికి నిప్పంటించారా? లేక ఇంట్లో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News