లేకపోతే టోల్ ఫీజు రెండింతలు
న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేదీ దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహనా కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. అయితే కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ పొదుపు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్‌ను దాటేటప్పుడు సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేసింది.