Saturday, January 11, 2025

కాంగ్రెస్‌లోకి మండవ వెంకటేశ్వరరావు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక కాంగ్రెస్‌లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే టిడిపిలో సీనియర్ నేతగా వున్న మండవ వెంకటేశ్వరరావు 2019 ఉగాది పర్వదినాన సిఎం కెసిఆర్ టిఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉంటున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే ఏడాది సిఎం కెసిఆర్ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి సుమారు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కెసిఆర్‌తో సమావేశమైన అనంతరం మండవ వెంకటేశ్వరరావు టిఆర్‌ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు.

ప్రకటించిన 24 గంటలలోపే ఆయన కారెక్కేశారు. తదనంతరం వెంకటేశ్వరరావు తన పని తాను చేసుకుంటూ మీడియాకు, రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయినప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మండవకు ఇప్పటికీ పట్టుంది. ఆ ప్రాంతంలో స్థిరపడిన సెటిలర్స్‌తో ఆయనకు మంచి అనుబంధం వుంది. ఈ నేపథ్యంలో మండవ వెంకటేశ్వరరావును ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News