Tuesday, January 21, 2025

ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన మంధాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబ్ల్యుపిఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సిబి విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐపిఎల్‌లో గత 16 సంవత్సరాల నుంచి ఆర్‌సిబి పురుషుల జట్టు ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేదు. రెండో సీజన్‌లోనే టైటిల్‌ను సాధించడంతో ఆర్‌సిబి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్‌సిబి మహిళల జట్టును అభినందించారు.

డబ్ల్యుపిఎల్ టైటిల్ గెలిచిన తరువాత ఆర్‌సిబి కెప్టెన్ స్మృతి మంధాన, బాయ్ ఫ్రెండ్ స్మృతి పలాస్‌తో కనిపించారు. ఈ యువ జంట టైటిల్‌ను చేతిలో పట్టుకొని సందడి చేశారు. గెలుపొందని తరువాత స్మృతి మంధాన, పలాస్ కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 2023 ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించినప్పుడు కూడా పలాస్ స్మృతి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలాస్ బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుగాంచాడు. ఈవెంట్‌లో మంధానతో పరిచయం ఏర్పడడంతో అది ప్రేమ మారినట్టు బాలీవుడు వర్గాలు కోడైకూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News