Monday, December 23, 2024

తిరుమలలో కుండపోత వర్షం.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత

- Advertisement -
- Advertisement -

మాండౌస్ తుపాన్‌తో తిరుమల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ రావడంతో యాత్రికులు నానా ఇక్కట్లకు గురయ్యారు. వర్షాలతో తిరుమల కొండలు తడిసిముద్దయ్యి, కొండచరియలు విరిగి పడే ముప్పు తలెత్తింది. దీనితో ఘాటు రోడ్డులో పలు కీలక జాగ్రత్తలు తీసుకున్నారు.

శ్రీవారి మెట్ల మార్గంలో వరద నీరు సుడులు తిరుగుతూ ఉండటంతో ఈ దారిలో యాత్రికులు వెళ్లేందుకు అనుమతించడం లేదు. తిరుమలలో శిలాతోరణం, పాపనాశనం దారిని మూసేశారు. వరదలు తగ్గేవరకూ ప్రమాదకర రూట్లలో వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కపిలతీర్థం జలపాతం ఉధృతంగా కన్పిస్తోంది. ఇక్కడ భక్తులను పుష్కరిణి స్నానాలకు అనుమతించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News