Friday, December 20, 2024

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం..

- Advertisement -
- Advertisement -

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
‘మాండూస్’గా నామకరణం చేసిన వాతావరణ శాఖ
చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం
హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా దూసుకువెళుతోందని అధికారులు తెలిపారు. కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమయ్యిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోటల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ తుఫాను ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News