- Advertisement -
కరీంనగర్: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులపై కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకే తలమానకంగా అభివృద్ధి పనులు ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరే కాకుండా ప్రరిశ్రమలు, టూరిజం రంగాలకు అవకాశాలు వస్తున్నాయన్నారు. మానేరు రివర్ ఫ్రంట్లో భాగమైన ఐదు చెక్ డ్యామ్లు, కేబుల్ బ్రిడ్జిలు పూర్తి కావొస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్ విజన్ మేరకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -