Wednesday, March 26, 2025

మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రాజీనామా… చిరంజీవే కారణమా?

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో వైసిపికి షాక్ తగిలింది. వైసిపి సభ్యత్వంతో పాటు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి రాజీనామా లేఖను అందేశారు. మంగళగిరి వైసిపి ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించడంతోనే ఆళ్ల రాజీనామా చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికలలో టిడిపి నేత లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్శంగా ఆర్‌కె మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలతో అతి త్వరలో తెలియజేస్తానని, తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరానని వివరణ ఇచ్చారు. ఎంఎల్‌ఎ పదవికి, వైసిపికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని వెల్లడించారు.

మంగళగిరిని వైసిపి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి అడ్డుకుంటుందని ఆళ్ల అనుచరులు భావిస్తున్నారు. మంగళగిరికి రూ.1250 కోట్ల నిధులు ఇస్తామని ఇవ్వకపోవడంతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరిలో గత కొంతకాలంగా వైసిపి నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా తాడేపల్లిలో నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఆళ్లకు కోపం వచ్చింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఉండగా మరో కార్యాలయం ఎందుకు అని పలుమార్లు పార్టీ నేతలతో ఆర్‌కె చర్చించినట్టు సమాచారం. వైసిపిలో విభేధాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతోనే ఆయన రాజీనామా చేసినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News