Monday, January 20, 2025

అఘోరీని అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీ హల్ చల్ చేస్తుండడం తెలిసిందే. జనజీవనానికి ఆటంకం కలిగించే రీతిలో ఆమె చేష్టలు ఉండడంతో, ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఆ అఘోరీ మంగళగిరిలోనూ తన చర్యలతో అందరినీ హడలెత్తించింది. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనంటూ ఏకంగా జాతీయ రహదారిపై బైఠాయించిం ది. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆమెను అక్కడ్నించి తరలించేందుకు పోలీసులు యత్నించగా, ఆమె వారిపైనా చేయిచేసుకుంది. అనంతరం, పోలీసులు ఆ అఘోరీని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. ఓ డిసిఎం వ్యాన్‌ను తీసుకొచ్చిన పోలీసులు ఆమెను ఈడ్చుకెళ్లి ఆ వ్యాన్ లోకి ఎక్కించారు. దాంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News