Sunday, February 23, 2025

సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు

- Advertisement -
- Advertisement -

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం నోటీసులు ఇచ్చారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఆయన గురువారం హాజరు కానున్నారు. టిడిపి ప్రధాన కార్యాలయంపై వైసిపి నేతల నేతృత్వంలో కార్యకర్తలు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఇటీవల ప్రభుత్వం సిఐడికి కూడా బదిలీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. మరి కొందరు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు మంగళగిరి పోలీసులు జారీ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News