Wednesday, January 22, 2025

అక్టోబర్ 21న ‘మంగళవారం’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ వీకెండ్ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. అక్టోబర్ 21న ‘మంగళవారం’ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన రెండు పాటలు, టీజర్ ప్రేక్షకులలో మంగళవారం సినిమాపై ఆసక్తి పెంచాయని ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. టీజర్ విడుదల తర్వాత చాలామంది బావుందంటూ మెసేజ్ చేశారు. రెండు పాటలు వేటికవే వైవిధ్యంగా ఉన్నాయని చెప్పారు.‌ కథపై ఆసక్తి పెరిగిందన్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకులకు కథ గురించి ఇంకొంత తెలుస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమిది” అని చెప్పారు. ‘మంగళవారం’ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News