Wednesday, January 22, 2025

‘మంగళవారం’ పెద్ద సినిమా అవుతుంది

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఎక్స్ 100’, ’మహాసముద్రం’ చిత్రాల త ర్వాత యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సిని మా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చి త్రానికి అజయ్ భూపతి ’ఎ’ క్రియేటివ్ వర్క్ నిర్మాణ భాగస్వా మి. ముద్ర మీడియా వర్క్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి ఈ సినిమాను నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన స క్సెస్ మీట్‌లో అగ్ర నిర్మాత, ఈ చి త్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ ”నాకు ’మంగళవారం’ కథ విన్నప్పుడు వంశీ ’అన్వేషణ’ గుర్తుకు వచ్చింది.

ఆ సినిమా ఎలా ఎంజాయ్ చేశానో… కథ విన్నప్పుడు అలా ఎంజాయ్ చేశా. నాకు బుధవారం ఉదయం షో వేశారు. కథ నాకు తెలిసినా సాధారణ ప్రేక్షకుడిలా చూశా. ఇంటర్వెల్ అవ్వగానే ఆసక్తిగా ఉందని చెప్పా. సెకండాఫ్ ఫస్ట్ 20 నిమిషాలు ’వావ్’ అనిపించాడు. ’అరుంధతి’ సినిమా చూ సినప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో… అలా అనిపించింది. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం క్లైమాక్స్, ఆ ట్విస్టులు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాలి. ఇది ఆగే సినిమా కాదు… ఇంకా పెద్ద సినిమా అవుతుంది” అని చెప్పారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ “సినిమా చూసిన వాళ్ళు’ఆర్‌ఎక్స్ 100’ కంటే బెస్ట్ సినిమా అంటున్నారు. అజనీష్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. మ్యూజిక్ మనసులో నుంచి పోవడం లేదని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. ఇంకో ప్రేక్షకుడు శివేంద్ర కెమెరా వర్క్ గురించి మాట్లాడాడు. నేను మూడు సినిమాలు తీస్తే ముగ్గురు తెలుగు కెమెరా మ్యాన్స్ వర్క్ చేశారు. దర్శకుడికి విజువల్ సెన్స్ ఉండి చెప్పగలిగితే… ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నా యి. ‘మంగళవారం’ చూసిన ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ అంటున్నారు ”అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాయల్ రాజ్‌పుత్, స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, దాశరథి శివేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News