Monday, December 23, 2024

మంగళ్‌హాట్ డిఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

నేరస్థులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మంగళ్‌హాట్ డిఐని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళ్‌హాట్ డిటెక్టివ్ ఇన్ప్‌క్టర్‌గా మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు. నేరస్థులతో స్నేహం చేయడంతోపాటు, వారితో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, డిఐ మహేందర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా మహేందర్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పేకాట స్థావరాల నిర్వాహకులతో కలిసి తిరుగుతున్నాడని, గంజాయి విక్రయించేవారు, సట్టా నిర్వహకులు, రౌడీషీటర్లు, బెల్ట్ షాపు నిర్వాహకులతో స్నేహం చేస్తున్నట్లు తెలిసింది. గంజాయి విక్రయిస్తున్న వారితో స్నేహంగా ఉంటూ వారు గంజాయి విక్రయించేందుకు సహకరిస్తున్నట్లు తెలిసింది. మహేందర్‌రెడ్డిపై విచారణ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News