Friday, December 20, 2024

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ పై మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి బహిష్కృత నేత, గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళ్‌హాట్ పోలీసులు ఆయన పై మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇటీవల ట్విట్టర్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇటీవల నోటీసులు జారీ చేశారు. దీనిపై రాజాసింగ్ తరపు న్యాయవాదులు వివరణ ఇవ్వగా పోలీసులు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టినందుకు రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై రాజాసింగ్ స్పందించారు.

గతంలో ఒవైసి సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రాజాసింగ్ గుర్తు చేశారు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. తన పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవ హరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకే తనపై వరుస కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఈ నెల 6న అయోధ్యపై రాజాసింగ్ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇటీవల మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందని పోలీసులు తాజాగా రాజాసింగ్‌పై మరో కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది నవంబర్ 9వ తేదిన చర్లపల్లి జైలు నుండి రాజాసింగ్ విడుదలయ్యారు. పలు షరతులతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మూడు మాసాల పాటు సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేసి ఈ ఏడాది ఆగస్టు 25న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. ఆగస్టు 22న అరెస్ట్ చేశారు. అయితే రాజాసింగ్‌కు కోర్టు రిమాండ్ విధించలేదు.

దీంతో ఆయనను పోలీసులు విడిచిపెట్టారు. అయితే పాతకేసులను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్‌పై పిడియాక్ట్ నమోదు చేసి ఆగస్టు 25న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News